హుస్నాబాద్: మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వాలంభన కోసం అడుగులు వేయాలని నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య అన్నారు. నెహ్రూ యువ కేంద్రం సౌజన్యంతో ధర్మతేజ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణలో ప్రావీణ్యం పొందిన మహిళలకు చైర్మన్ గురువారం సర్టిఫికెట్లు అందజేశారు.
-
నగర పంచాయతీ చైర్మన్ చంద్రయ్య
హుస్నాబాద్: మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వాలంభన కోసం అడుగులు వేయాలని నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య అన్నారు. నెహ్రూ యువ కేంద్రం సౌజన్యంతో ధర్మతేజ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణలో ప్రావీణ్యం పొందిన మహిళలకు చైర్మన్ గురువారం సర్టిఫికెట్లు అందజేశారు. అంతకముందు సొసైటీ ఆవరణలో మొక్కలను నాటారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వశక్తితో జీవితంలో ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాంరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మన్ బొలిశెట్టి సుధాకర్, కౌన్సిలర్ ఇంద్రాల సారయ్య, ఎన్‌వైకే ఇన్‌చార్జి రవీందర్, సోసైటీ చైర్‌పర్సన్ జంగ విజయ, నాదమునుల రామరావు, పిడిశెట్టి రాజు, సుభాష్ , మహిళలు పాల్గొన్నారు.