విద్యుదాఘాతంతో రైతు మృతి | with curent shock farmer died | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 15 2016 5:23 PM | Updated on Oct 1 2018 2:44 PM

విద్యుదాఘాతంతో రైతు మృతి - Sakshi

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన తుర్కపల్లి మండలం గంధమల్లలో గురువారం చోటు చేసుకుంది.

తుర్కపల్లి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన  తుర్కపల్లి మండలం గంధమల్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పిట్టల అంజయ్య (55)ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పొలాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో మోటార్‌కు వెళ్లే విద్యుత్‌ వైర్లు అతడి కాలుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక రైతులు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement