సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. | We will work to solve problems .. | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

Jul 31 2016 12:26 AM | Updated on Sep 4 2017 7:04 AM

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

తెలంగాణ హైకోర్టు సాధన ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు సంబంధించిన సమస్యలు, కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షదారులకు కనీస సౌకర్యాల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా పోర్టు ఫోలియో జడ్జి, హైకోర్టు జడ్జి పి.నవీన్‌రావు తెలిపారు.

న్యాయవాదులతో హైకోర్టు జడ్జి నవీన్‌రావు
కోర్టు ప్రాంగణంలో హరితహారం 
న్యాయమూర్తులకు వర్క్‌షాప్‌
వరంగల్‌ లీగల్‌ : తెలంగాణ హైకోర్టు సాధన ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు సంబంధించిన సమస్యలు, కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షదారులకు కనీస సౌకర్యాల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా పోర్టు ఫోలియో జడ్జి, హైకోర్టు జడ్జి పి.నవీన్‌రావు తెలిపారు. జిల్లాకు శనివారం వచ్చిన ఆయన తొలుత కోర్టు ప్రాంగణంలో హరితహారంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ, జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి ఎం.లక్ష్మణ్, మహాæనగరపాలక సంస్థ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పోలీసు కమీషనర్‌ సుధీర్‌బాబుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ చదువుకున్న తనకు వరంగల్‌పై ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. ఆ తర్వాత జిల్లా కోర్టు కాన్ఫరెన్స్‌ హాల్‌లో న్యాయమూర్తులకు ‘సాక్ష్యాధారాల నమోదు’పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో కూడా నవీన్‌రావు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై రిటైర్‌ జిల్లా జడ్జి యస్‌.మాధవరావు, సీబీఐ కోర్టు జడ్జి చక్రవర్తి, జనగాం కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిలు, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సహోదర్‌రెడ్డి, జయాకర్, టీ.వీ.రమణ, అల్లం నాగరాజు, కవిత తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement