బాబు మాటలు నమ్మి మోసపోయాం | we were believing ... but him .. | Sakshi
Sakshi News home page

బాబు మాటలు నమ్మి మోసపోయాం

Jul 18 2016 12:29 AM | Updated on Jul 28 2018 3:15 PM

బాబు మాటలు నమ్మి మోసపోయాం - Sakshi

బాబు మాటలు నమ్మి మోసపోయాం

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని పలువురు ప్రజలు వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాలోని రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల పరిధిలో గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు.


గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమంలో ప్రజల మనోగతం

రాజంపేట టౌన్‌:
ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని పలువురు ప్రజలు వైఎస్సార్‌సీపీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాలోని రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల పరిధిలో గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమం నిర్వహించారు. రాజంపేటలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి బోయపాలెం 2, ఈడిగపాళెం వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆయనతో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ మాటలు నమ్మి నిలువునా మునిగామని పలువురు మహిళలు వాపోయారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామన్నారు.

అలాగే  పోరుమామిళ్ల మండలంలోని బొప్పాపురం, చెన్నారెడ్డిపేట, దళితవాడల్లో  నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు సి.యం బాషా తదితరులు ఇంటింటికి వెళ్లి కరపత్రాల పంపిణీ చేస్తూ చంద్రబాబు పాలనను వివరించారు. బాబు పాలన సమస్తం అవినీతిమయంగా మారిందన్నారు. దీనిపై స్పందించిన జనం భవిష్యత్తులో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement