అమరచింతను అభివృద్ధి చేసుకుందాం | We have to Develop amarchintha | Sakshi
Sakshi News home page

అమరచింతను అభివృద్ధి చేసుకుందాం

Aug 28 2016 10:37 PM | Updated on Sep 4 2017 11:19 AM

ఆత్మకూర్‌ (నర్వ) : నూతనంగా ఏర్పడనున్న అమరచింత మండలంలో సాగు, తాగునీటితో పాటు మంచివిద్య అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల సహకారం అవసరమని మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ దేశాయి ప్రకాష్‌రెడ్డి కోరారు.

– అఖిలపక్షం నాయకులతో దేశాయి ప్రకాష్‌రెడ్డి
ఆత్మకూర్‌ (నర్వ) : నూతనంగా ఏర్పడనున్న అమరచింత మండలంలో సాగు, తాగునీటితో పాటు మంచివిద్య అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల సహకారం అవసరమని మాజీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ దేశాయి ప్రకాష్‌రెడ్డి కోరారు. ఆదివారం అమరచింత గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ పురం వెంకటేశ్వర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్షం సమావేశానికి ఆయన ముఖ్య అతి«థిగా హాజరై మాట్లాడారు. కొత్త మండలాల ఏర్పాటులో అమరచింతకు ప్రాధాన్యత కల్పించేవిధంగా కషి చేసిన మంత్రులు జూపల్లి కష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డికి అఖిలపక్షం తరపున కతజ్ఞతలు తెలిపారు. కొంతమంది పనిగట్టుకొని అమరచింత గ్రామంపై నిందలు వేస్తున్నారని అలాంటివారి ఆలోచనలను తిప్పికొడుతూ అమరచింత ప్రేమను పంచే గ్రామమని తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అమరచింత మండల పరిధిలోకి వచ్చే గ్రామాలకు సాగునీరు, తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం కల్పించి అన్ని గ్రామాల ప్రజలకు సమాన దష్టితో వ్యవహరించి పనులు చేస్తామన్న భరోసాను ఆయా గ్రామాల ప్రజల్లో కల్పించాలని సూచించారు. విమర్శలు, ప్రతి విమర్శలు పక్కనపెట్టి కొత్త మండల అభివద్ధికి సహకరించడానికి తానుకూడా గ్రామస్తుడిగా చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులతో పాటు ఎంపీటీసీ సభ్యుడు విష్ణు, వార్డుసభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement