అవిటివారిని ఆదుకుంటాం | we are supporting handcaps | Sakshi
Sakshi News home page

అవిటివారిని ఆదుకుంటాం

Jul 20 2016 10:26 PM | Updated on Aug 30 2019 8:37 PM

జిల్లాలోని వికలాంగులను ఆదుకుంటామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం అంబేద్కర్‌ స్టేడియంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. మోటివేషన్‌ ఇండియా సహాయ సహకారాలతో ట్రైసైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

కరీంనగర్‌: జిల్లాలోని వికలాంగులను ఆదుకుంటామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం అంబేద్కర్‌ స్టేడియంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. మోటివేషన్‌ ఇండియా సహాయ సహకారాలతో ట్రైసైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. వినికిడి కోల్పోయిన 10 మందికి ఒక ఆపరేషన్‌కు రూ.8 లక్షల చొప్పు ఖర్చు భరించి శస్త్రచికిత్సలు నిర్వహించామని.. వారికి తిరిగి వినికిడి శక్తి వచ్చిందని తెలిపారు. జిల్లాలో వినికిడి కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే వాళ్లందరికీ దాతల సహకారంతో ఆపరేషన్లు నిర్వహిస్తావుని మంత్రి తెలిపారు. అలాంటి వారి వివరాలు సేకరించాలని వికలాంగుల శాఖ ఏడీని ఆదేశించారు. ట్రై సైకిళ్లన్నీ అమెరికాలో తయారు చేశారని.. వాటిని మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వాలు మాత్రమే అన్ని పనులు చేయలేవని.. మానవతాదృక్పథంతో ముందుకు వచ్చిన సంస్థల సహకారంతో వికలాంగులందరికీ సహాయ సహకాలందిస్తామని అన్నారు. అంతుకు ముందు మాట్లాడిన అమెరికాకు చెందిన న్యూటన్‌ మాట్లాడుతూ ఎల్‌డీఎస్‌ చారిటబుల్‌ ట్రస్టు ప్రతినిధిగా వచ్చినట్లు తెలిపారు. సైకిళ్ల పంపిణీతో 280 కుటుంబాలకు లబ్ధిచేకూరిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్‌ నీతూప్రసాద్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ న ళిని తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement