మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో శుక్రవారం సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల నుంచి బారీ ఎత్తున కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
-
టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు
-
పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు
-
రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తాం
-
రెండు పంటలకు నీరందిస్తాం
-
సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావు
ఇప్పగూడెం(స్టేషన్‌ఘన్‌పూర్) : ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో శుక్రవారం సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల నుంచి బారీ ఎత్తున కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇంతకు ముందు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఏఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తుండగానే అటు టీడీపీ, ఇటు సీపీఎం అడ్డుకోవాలని చూడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.
ఇక్కడ ప్రాజెక్టులు కడితే ఆంధ్రాకు నీళ్లు రావనే దురుద్దేశంతో సీపీఎం వారితో అడ్డగించేలా ఆంధ్రా సీఎం చంద్రబాబు కుట్రపనుతున్నారని, వీళ్లు చేస్తున్న వ్యతిరేక పనులను చూసి ఆయా పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేకుండా చేస్తామన్నారు. తెలంగాణలో రెండు పంటలు పండేలా చేయాలన్నదే కేసీఆర్ ధ్యేయమన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, సిద్ధిపేట తనకు రెండు కళ్లలాంటివని, ఘన్‌పూర్‌లో ఈసారి వంద చెరువులు నింపుతామన్నారు. నియోజక వర్గంలో లక్షా 80వేల ఎకరాలకు వరద కాల్వ నుంచి ప్రత్యేకంగా నీరు ఇస్తామని చెప్పారు. జిల్లాకు ప్రస్తుతం 8 టీఎంసీల నీరు అందుతుందని, రానున్న రోజుల్లో 100 టీఎంసీల నీరు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అదనంగా 1400 క్యూసెక్కుల నీటికోసం మరో పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
మార్కెట్ యార్డులో మొక్కలు నాటిన మంత్రి
స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి మొక్కలను నాటారు. అనంతరం వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
24గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం
ఇప్పగూడెం 33-11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి గ్రామానికి 24 గంటల విద్యుత్ సరఫరాను మంత్రి ప్రారంభిచారు.
బారీగా చేరికలు
గ్రామానికి చెందిన టీడీపీ, బీజేపీ, సీపీఎంల నుంచి కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. చేరిన వారిలో సీపీఎం ఎంపీటీసీ సభ్యురాలు తోట లత, కాంట్రాక్టర్ తోట వెంకన్న, దైద ఇలీషన్, బీజేపీ నుంచి అనంతరెడ్డి, ఉపసర్పంచ్ చట్ల యాకయ్యతో పాటు రెండు వందల మంది ఉన్నారు.