తెలంగాణ ఉద్యమంతో పాటు మాదిగ సామాజిక కార్యక్రమాల్లో తొలి నుంచీ అగ్రభాగంలో నడుస్తున్న వంగపల్లి
సీఎంకు తెలంగాణ ఎంఆర్‌పీఎస్ వినతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంతో పాటు మాదిగ సామాజిక కార్యక్రమాల్లో తొలి నుంచీ అగ్రభాగంలో నడుస్తున్న వంగపల్లి శ్రీనివాస్‌కు వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఎంఆర్‌పీఎస్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంఆర్‌పీఎస్ ముఖ్య నాయకులంతా ఆదివారం సమావేశమయ్యారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో మాదిగ కులస్తుల నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం లేదని వారీ సందర్భంగా చెప్పారు. అతిపెద్ద సామాజిక వర్గమైన తమకు గుర్తింపునిస్తూ శ్రీనివాస్‌ను పోటీకి దింపితే, భారీ మెజారిటీతో గెలిపించి ఆ స్థానాన్ని సీఎంకు కానుకగా ఇస్తామన్నారు.