హోరాహోరీగా వాలీబాల్‌ పోటీలు | Volley ball tourney continues for the second day | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా వాలీబాల్‌ పోటీలు

Oct 8 2016 1:49 AM | Updated on Sep 4 2017 4:32 PM

హోరాహోరీగా వాలీబాల్‌ పోటీలు

హోరాహోరీగా వాలీబాల్‌ పోటీలు

గూడూరు: క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తేనే రాణించగలరని రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే గనబాబు పేర్కొన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి.

గూడూరు: క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తేనే రాణించగలరని రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే గనబాబు పేర్కొన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. పలు జిల్లాలకు చెందిన, పురుషులు, మహిళా జట్లకు ఉదయం 7.30 నుంచే పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాజరైన గనబాబు మాట్లాడారు. గూడూరులో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. సహకారం అందించిన కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీని ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో స్థానం సాధించిన వారిలో 90 శాతం మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, మునిగిరీష్‌, తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement