రామారైస్‌మిల్‌పై విజిలెన్స్‌ దాడి | vigilance attack on ramaricemill | Sakshi
Sakshi News home page

రామారైస్‌మిల్‌పై విజిలెన్స్‌ దాడి

Sep 4 2016 10:04 PM | Updated on Sep 4 2017 12:18 PM

కేసు  రాస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కేసు రాస్తున్న విజిలెన్స్‌ అధికారులు

మండలపరిధిలోని ఉడుములపాడు గ్రామం సమీపంలోని రామారైస్‌మిల్‌పై జిల్లా విజిలెన్స్‌ అధికారులు అదివారం దాడులు నిర్వహించారు.

–148 బస్తాల రేషన్‌బియ్యం స్వాధీనం
 
డోన్‌ టౌన్‌ : మండలపరిధిలోని ఉడుములపాడు గ్రామం సమీపంలోని రామారైస్‌మిల్‌పై జిల్లా విజిలెన్స్‌ అధికారులు అదివారం దాడులు నిర్వహించారు. 148 బస్తాల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం గతంలోనే డోన్‌ రెవెన్యూ అధికారి సీజ్‌ చేసి జగదూర్తి గ్రామానికి చెందిన ప్రతాప్‌రెడ్డికి అప్పగిస్తూ  లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారని రైస్‌మిల్‌ యజమాని గోపాల్‌ చెప్పుకొచ్చారు.  ప్రతాప్‌రెడ్డి ఇక్కడేందుకు  ఆ బియ్యాన్ని ఎందుకు నిల్వ చేశారని అధికారులు ప్రశ్నించగాS రైస్‌మిల్‌ యజమాని సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పట్టుబడిన బియ్యాన్ని సీజ్‌చేసి డోన్‌ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. విజిలెన్స్‌ ఎస్‌ఐ సుబ్బారావు,స్పెషల్‌ తహసీల్దార్‌ రామకష్ణారావు తదితరులు ఈదాడుల్లో పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement