ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - Sakshi


వనపర్తి: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ శ్వేతా మహంతి సూచించారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై మంజూరు చేసిన చాప్‌ కట్టర్స్‌ను గురువారం ఆమె స్థానిక పశుసంవర్ధకశాఖ జిల్లా కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. తకుముందు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఒక్కో టాప్‌ కట్టర్‌ పూర్తి విలువ రూ.23760 ఉండగా లబ్ధిదారులకు 50శాతం సబ్సిడీపై పాడి రైతులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి విజయరాజు తెలిపారు. అలాగే పెరటి కోళ్ల పెంపకం యూనిట్లను, దూడల రక్షణ కోసం దాణ ను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు నెలల వయస్సులో ఉన్న దూడలను ఈ స్కీం పరిధిలోకి తీసుకుంటామన్నారు. ఈ స్కీంలో ఒక్కో యూనిట్‌ విలువ రూ.6003 కాగా లబ్ధిదారుడు రూ.2628 చెల్లించాలని, మిగతా రూ.3375 ప్రభుత్వం వెచ్చించనుందని తెలిపారు.



ఈ స్కీంలో లబ్ధిదారుడు చెల్లించిన రూ.628లను వెచ్చించి దూడకు, రైతుకు ఇన్సూరెన్స్‌ చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పాడిరైతుల కోసం ప్రవేశపెట్టిన సునందిని పథకాన్ని జిల్లా రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి పవన్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌ స్టాక్‌పాయింట్‌ను పరిశీలించిన జేసీ



వనపర్తి : స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఎంఎల్‌ఎస్‌ (మండల్‌ లెవల్‌ స్టాక్‌) పాయింట్‌ను గురువారం సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ నిరంజన్‌రావు సందర్శించారు. ఇక్కడి నుంచి రేషన్‌ షాపులకు సరఫరా చేస్తున్న సరుకుల వివరాలతో పాటు ప్రతి నెలా సరుకుల పంపిణీ తేదీల వివరాల రికార్డులను పరిశీలించారు. వనపర్తి జిల్లా ఏర్పాటు తర్వాత రేషన్‌ సరుకుల సరఫరా వివరాలను మేనేజింగ్‌ సివిల్‌ సప్లయి అధికారి అలివేలమంగను అడిగి తెలుసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top