రైలు కింద పడి ఇద్దరి దుర్మరణం | Two people died | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఇద్దరి దుర్మరణం

Jul 27 2016 11:39 PM | Updated on Sep 4 2017 6:35 AM

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైలు కింద పడి ఇద్దరు దుర్మరణం చెందారు. విజయనగరం రైల్వేస్టేషన్‌ యార్డు డౌన్‌లౌన్‌ ట్రాక్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించి ఉన్నాడని జీఆర్‌పీ దర్యాప్తు అధికారి బి. గౌరినాయుడు బుధవారం తెలిపారు.

విజయనగరం టౌన్‌ :  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైలు కింద పడి ఇద్దరు దుర్మరణం చెందారు. విజయనగరం రైల్వేస్టేషన్‌ యార్డు డౌన్‌లౌన్‌ ట్రాక్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించి ఉన్నాడని జీఆర్‌పీ దర్యాప్తు అధికారి బి. గౌరినాయుడు బుధవారం తెలిపారు. ఇతని వద్ద శ్రీకాకుళం నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు తీసిని జనరల్‌ టికెట్‌ లభించిందన్నారు. మతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. చామనఛాయ రంగు కలిగి కుడి భుజంపై ఏసు ప్రభువు, సిలువ పచ్చబొట్టు ఉందని తెలిపారు. 26వ తేదీన ఈప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. నీలం రంగు జీన్‌ఫ్యాంట్, ఆకుపచ్చ ఫుల్‌హ్యాండ్‌ షర్ట్‌ వేసుకున్నాడని, వివరాలు తెలిసిన వారు 94416 12121, 94906 17085 నంబర్లకు సంప్రదించాని కోరారు. 
– కోమటిపల్లి స్టేషన్‌ సమీపంలో...
దత్తిరాజేరు : మండలంలోని కోమటిపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి మహిళ కన్నుమూసింది. ఈమె వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుంది. ట్రాక్‌ పరిశీలన చేస్తుండగా మహిళ శవాన్ని కీమన్‌ అబద్ధం గుర్తించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement