అదుపు తప్పిన బైక్‌ | two injured in bike accident | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన బైక్‌

Sep 15 2016 11:39 PM | Updated on Oct 20 2018 6:19 PM

అదుపు తప్పిన బైక్‌ - Sakshi

అదుపు తప్పిన బైక్‌

నెల్లూరు రూరల్‌ : మితిమీరిన వేగంతో వెళ్తున్న బైక్‌ అదుపు తప్పడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన మండంలోని ములమూడి సమీపంలో గురువారం జరిగింది.

 
  • ఇద్దరికి తీవ్ర గాయాలు
నెల్లూరు రూరల్‌ :  మితిమీరిన వేగంతో వెళ్తున్న బైక్‌ అదుపు తప్పడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన మండంలోని ములమూడి సమీపంలో గురువారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. సంగం మండలం పల్లపాడుకు చెందిన ఎన్‌.శ్రీనివాసులు, పి.శ్రీనివాసులు ములమూడిలోని ఓ శుభకార్యానికి బైక్‌పై వచ్చారు. ఇద్దరు మద్యం తాగి తిరిగి బైక్‌పై వారి గ్రామానికి బయలుదేరారు. దేవరపాళెం సమీపంలో బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువ ఒడ్డున పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను నెల్లూరులోని సింహపురి ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో వారి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement