ఏలూరు అర్బన్ : ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుడిని మోసగించిన కే సులో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది.
ఉద్యోగం పేరుతో మోసగించిన ఇద్దరికి జైలు
Sep 3 2016 1:52 AM | Updated on Dec 27 2018 4:17 PM
ఏలూరు అర్బన్ : ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుడిని మోసగించిన కే సులో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది. స్థానిక ఇశ్రాయేలు పేటకు చెందిన పులిపాక రవీంద్ర, హైదరాబాద్‌కు చెందిన ఆది విజయలక్ష్మి నగరానికి చెందిన యువకుడు తొమ్మండ్రు రత్నబాబును ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 2011లో రూ.95వేలు తీసుకున్నారు. తరువాత ముఖం చాటేశారు. దీంతో బాధితుడు స్థానిక టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాటి ఎస్సై, ఎస్.సి.హెచ్.కొండలరావు కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న ఏలూరు స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్, షేక్ అబ్దుల్ షరీఫ్ నిందితులు నేరం చేశారని నిర్ధారించారు. ఒక్కొక్కరికి ఏడాదిపాటు జైలు శిక్షతో పాటు నగదు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ విషయాన్ని టూటౌన్ పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement