వీర జవాన్లకు నివాళి | Tribute to Soldiers | Sakshi
Sakshi News home page

వీర జవాన్లకు నివాళి

Sep 24 2016 7:02 PM | Updated on Sep 4 2017 2:48 PM

వీర జవాన్లకు నివాళి

వీర జవాన్లకు నివాళి

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు మండలంలోని తిమ్మాపూర్, ఎర్దండిలో శనివారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ఘన నివాళులు అర్పించారు.

ఇబ్రహీంపట్నం:  కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు మండలంలోని తిమ్మాపూర్, ఎర్దండిలో శనివారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ఘన నివాళులు అర్పించారు.  జవాన్ల ఫోటోల వద్ద కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దాసరి రాజవ్వ,  సింగిల్‌విండో చైర్మన్‌ నోముల లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్‌ సునిల్, ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, నాయకులు సత్తన్న, నిరంజన్‌ భట్టు,  విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement