నేడు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం | today ysrcp dist meeting | Sakshi
Sakshi News home page

నేడు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం

Jul 19 2016 8:16 PM | Updated on May 29 2018 4:26 PM

నేడు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం - Sakshi

నేడు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షిప్రతినిధి, ఖమ్మం:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారన్నారు. జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, మండలస్థాయి కమిటీల నియామకంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలిపారు. సమీక్ష సమావేశానికి జిల్లాలోని పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరుకావాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement