మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్టేడియంలో అండర్–14, అండర్–17 హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, యోగా జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
నేడు ఎస్‌జీఎఫ్ జట్ల ఎంపికలు
Sep 26 2016 12:43 AM | Updated on Sep 4 2017 2:58 PM
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్టేడియంలో అండర్–14, అండర్–17 హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, యోగా జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 10 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని కోరారు.
27న వాలీబాల్, సాఫ్ట్‌బాల్ ఎంపికలు..
ఈనెల 27న కల్వకుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో అండర్–17 వాలీబాల్, ఆలంపూర్ మండలం బుక్కాపూర్‌లో అండర్–17 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్లను ఎంపికచేయనున్నట్లు సురేశ్‌కుమార్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, భోనపైడ్‌తో ఎంపికల్లో పాల్గొనాలని కోరారు.
Advertisement
Advertisement