నేడు ఆత్మకూరులో ‘రైతుపోరు’ | today raithuporu in atmakur | Sakshi
Sakshi News home page

నేడు ఆత్మకూరులో ‘రైతుపోరు’

Jan 6 2017 12:22 AM | Updated on May 29 2018 4:26 PM

ఆత్మకూరులో వైఎస్సార్‌ సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతుపోరు’ సభ నిర్వహిస్తున్నారు.

అనంతపురం: రైతులను విస్మరిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం ఆత్మకూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతుపోరు’ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది.

రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు సమీప నియోజకవర్గాల నుంచి  రైతులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. పార్టీ జిల్లా పరిశీలకులు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, రోజా, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్మన్‌ కవిత తదితరులు హాజరవుతారని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement