తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు.
నేడు బాధ్యతల నుంచి రిలీవ్ కానున్న జేసీ
May 8 2017 12:23 AM | Updated on Sep 5 2017 10:38 AM
కర్నూలు(అగ్రికల్చర్): తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. 2015 జనవరి 13న జేసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన దాదాపు 29 నెలలు పనిచేశారు. రిటర్నింగ్ అధికారిగా రెండు సార్లు శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలను నిర్వహించారు. కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించారు. దీర్ఘకాలం పనిచేసిన జేసీగా ఆయన గుర్తింపు పొందారు. బాధ్యతల నుంచి రిలీవ్ అయిన తర్వాత సోమవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నిర్వహించే వీడ్కోలు సభలో పాల్గొంటారు.
Advertisement
Advertisement