హిందూ ధర్మాన్ని కాపాడాలి : మంత్రి | to save hindu dharma | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మాన్ని కాపాడాలి : మంత్రి

Sep 27 2016 11:31 PM | Updated on Sep 4 2017 3:14 PM

ద్వారకా తిరుమల : ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూసిన నాడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు.

 ద్వారకా తిరుమల : ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూసిన నాడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ద్వారకా తిరుమల మాధవ కల్యాణ æమండపంలో నిర్వహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్‌ శిక్షణ తరగతుల్లో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం వంటి పలు అంశాలపై శిక్షణనిచ్చారు. వాసుదేవానంద స్వామిజీ, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, సమరసత సేవా ఫౌండేషన్‌ జనరల్‌ కార్యదర్శి పి.త్రినాథ్‌ పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement