ప్రముఖ చిత్రకారుడు శంషాద్ హుస్సేన్ ఇక లేరు | There is no longer the famous painter Shamshad Hussain | Sakshi
Sakshi News home page

ప్రముఖ చిత్రకారుడు శంషాద్ హుస్సేన్ ఇక లేరు

Oct 26 2015 4:34 AM | Updated on Sep 3 2017 11:28 AM

ప్రముఖ చిత్రకారుడు శంషాద్ హుస్సేన్ ఇక లేరు

ప్రముఖ చిత్రకారుడు శంషాద్ హుస్సేన్ ఇక లేరు

ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెద్ద కుమారుడు, ప్రముఖ కళాకారుడు శంషాద్ హుస్సేన్(70) శనివారంరాత్రి

లివర్ క్యాన్సర్‌తో ఢిల్లీలో కన్నుమూత
 
 సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెద్ద కుమారుడు, ప్రముఖ కళాకారుడు శంషాద్ హుస్సేన్(70) శనివారంరాత్రి ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళాప్రదర్శన లు నిర్వహించారు. లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఫైన్ ఆర్ట్స్ పట్టా పొందిన శంషాద్... హైదరాబాద్‌లోనూ పదేళ్లు తన కళను కొనసాగించారు. చిత్రాల్లో పలురకాల మనస్తత్వాలను ప్రతిబింబించారు.

 హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ దిగ్భ్రాంతి...
 శంషాద్ మృతిపట్ల ‘హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ’ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనకు హైదరాబాద్‌తోనూ విడదీయలేని అనుబంధం ఉందని సొసైటీ అధ్యక్షుడు రమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1980ల్లో లక్ష్మాగౌడ్, సూర్యప్రకాశ్, తోట వైకుంఠం వంటి ప్రసిద్ధ చిత్రకారులతో శంషాద్ కలసి పనిచేశారని గుర్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement