ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెనుక భాగంలోని తలుపు గడియను తొలగించి చోరీకి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు అయింది.
పట్టపగలు ఇంట్లో చోరీ
Sep 10 2016 9:34 PM | Updated on Mar 28 2019 6:18 PM
గుంటూరు ఈస్ట్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెనుక భాగంలోని తలుపు గడియను తొలగించి చోరీకి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు అయింది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐజి బంగ్లా వెనుక ప్రాంతంలో నివాసం ఉండే పునుగుపాటి రాధా నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంజక్షన్ చేయించుకునేందుకు ఇంటి సమీపంలోని క్లినిక్‌కు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చేసరికే ఇంటి వెనుకభాగంలోని తలుపులు తొలగించి ఉండడాన్ని గమనించి, లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించారు. బీరువాలో బంగారు ముత్యాల గొలుసు, ఉంగరం, రూ.10వేలు నగదుతోపాటు సెల్‌ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించి ఈ మేరకు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నగరపాలెం పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వో కరీముల్లాషావలి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీఎస్ అధికారులు, సిబ్బంది సంఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం అధికారులు వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement