వివాహేతర సంబంధమే హత్యకు కారణం ? | The reason for the killing of the affair? | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధమే హత్యకు కారణం ?

Aug 23 2016 12:24 AM | Updated on Sep 17 2018 6:26 PM

మండలంలోని మట్టెవాడ శివారు కొంగరగిద్దలో జరిగిన యువకుడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. శనివారం రాత్రి కొంగరగిద్దలో ఇరుప ఈశ్వర్‌ అనే యువకుడు మొక్కజొన్న చేనులో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై మట్టెవాడ, కొంగరగిద్దలో పలు రకాల ప్రచారం జరుగుతుండగా, మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గూడూరు : మండలంలోని మట్టెవాడ శివారు కొంగరగిద్దలో జరిగిన యువకుడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. శనివారం రాత్రి కొంగరగిద్దలో ఇరుప ఈశ్వర్‌ అనే యువకుడు మొక్కజొన్న చేనులో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై మట్టెవాడ, కొంగరగిద్దలో పలు రకాల ప్రచారం జరుగుతుండగా, మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో చంపామని వారు అంగీకరించినట్లు తెలిసింది. ఈ కేసు విషయమై సోమవారం పోలీసులను వివరణ కోరగా యువకుడి హత్య విచారణ ఓ కొలిక్కి వస్తున్నట్లు, పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement