రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లే
-
టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ
-
రైతు సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మొగుళ్లపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ కలిగి ధనిక రాష్ట్రం తెలంగాణ అని చెపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా పంట రుణాలను ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
సర్కారు ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని కోరారు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, దానికి చరమగీతం పాడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. మిషన్ కాకతీయ కాస్త అవినీతి కాకతీయగా మారిందని ఆరోపించారు. కాగా, సమావేశం అనంతరం రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, చిట్యాల మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల పరిశీలకుడు సదానందం, పిన్నింటి వెంకట్‌రావు, మండ రవిందర్, సురేష్, ఎండీ. రఫీ, రాము పాల్గొన్నారు.