పిడుగుపాటుకు రైతు మృతి | The farmer killed by lightning | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు రైతు మృతి

Jul 17 2016 6:44 PM | Updated on Aug 24 2018 2:36 PM

పొలానికి వెళ్లిన రైతు పిడుగుపడి చనిపోయాడు.

పొలానికి వెళ్లిన రైతు పిడుగుపడి చనిపోయాడు. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని పలుకూరు పంచాయతీ సోమ్లారాజుతండాకు చెందిన భూక్యా రాములు నాయక్(45) ఆదివారం మధ్యాహ్నం తన ఆవును తోలుకుని పెసరతోటకు కాపలాగా వెళ్లాడు. సాయంత్రం వాన మొదలు కావటంతో ఇంటి బాట పట్టాడు. అదేసమయంలో పిడుగుపడటంతో రైతుతోపాటు ఆవు కూడా చనిపోయింది. పిడుగు తీవ్రతకు సమీపంలోనే ఉన్న పీరయ్య కూడా స్వల్పంగా గాయపడ్డాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement