ఇంట్లో ఎవరూలేని సమయంలో చిట్టి డబ్బులు తీసుకొని బయటకు వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
ఇంట్లో ఎవరూలేని సమయంలో చిట్టి డబ్బులు తీసుకొని బయటకు వెళ్లిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎఎస్సై నారాయణ కథనం ప్రకారం...లాలాపేట ఇందిరనగర్‌కు చెందిన ఎన్. శంకర్(35) వృత్తిరీత్యా ప్రై వేటు ఉద్యోగి. అయితే ఈ నెల 19వ తేదీన శంకర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉన్న చిట్టి డబ్బులు 68 వేల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య రేణుక తెలిసిన వారిని, బంధువులను, స్థానికులను వాకబు చేసింది. కాని, ఫలితం దక్కలేదు. నాలుగు రోజులు గడుస్తున్నా భర్త ఇంటికి రాకపోవడంతో శంకర్ భార్య స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.