రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లా ల పునర్విభజనలో మంథని నియోజకవర్గాన్ని భూపాలపల్లి జిల్లాలో కలుపడంతో అక్కడి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారు ఇన్నాళ్లు విద్యా, వ్యాపారం తదితర అవసరాల నిమిత్తం భూపాలపల్లికి వచ్చేవారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడే భూపాలపల్లి జిల్లాలో మంథని నియోజకవర్గం కలుస్తుండటంతో వారి బంధం మరింత బలపడినట్లయ్యింది.
-
జయశంకర్ జిల్లాలో కలపడంతో అక్కడి ప్రజల్లో హర్షం
భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లా ల పునర్విభజనలో మంథని నియోజకవర్గాన్ని భూపాలపల్లి జిల్లాలో కలుపడంతో అక్కడి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారు ఇన్నాళ్లు విద్యా, వ్యాపారం తదితర అవసరాల నిమిత్తం భూపాలపల్లికి వచ్చేవారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడే భూపాలపల్లి జిల్లాలో మంథని నియోజకవర్గం కలుస్తుండటంతో వారి బంధం మరింత బలపడినట్లయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లిని ఆచార్య జయశంకర్ జిల్లాగా ఏర్పాటు చేయనుంది. నియోజకవర్గం లోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, ములుగు నియోజకవర్గంలోని ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మంథని నియోజకవర్గంలోని కాటారం, మల్హర్‌రావు, మహముత్తారం, మహాదేవ్‌పూర్ మండలాలతో జిల్లాను ఏర్పాటు కానుంది.
30 ఏళ్లుగా భూపాలపల్లితో సత్సంబంధాలు
భూపాలపల్లి పట్టణంతో కాటారం, మల్హర్‌రా వు, మహాముత్తారం, మహాదేవ్‌పూర్ మండలాల ప్రజలకు 30 ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. విద్యార్థులు జూనియర్, డిగ్రీ, పీజీ చదువుల కోసం ఇక్కడికే వస్తుంటారు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలల్లో ఆయా మండలాలకు చెందిన విద్యార్థులు 40 శాతానికి పైగా ఉంటారు. అలాగే అక్కడ మెరుగైన వైద్య సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. పరిస్థితి విషమిస్తే మాత్రం వరంగల్‌కు వెళ్తారు. రైతులు ఎరువు లు, క్రిమి సంహారక మందులు, పనిముట్ల కొ నుగోళ్లు, కూరగాయల క్రయ, విక్రయ నిమిత్తం వస్తుంటారు. కాటారం, మల్హర్‌రావు, మహాముత్తారం, మహాదేవ్‌పూర్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు వెళ్లాలం టే సుమారు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించాల్సి ఉండేది. చిన్న పనికి సైతం ఒకటి, రెండు రోజులు వెచ్చించాల్సి వచ్చేది. కాగా ఆయా మండలాలు జయశంకర్ జిల్లాలో కలుస్తుండటంతో దూర భారం తగ్గింది.