జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. మంగళవారం చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కొనసాగుతోన్న చలి తీవ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. మంగళవారం చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో జనం వణికిపోతున్నారు. తనకల్లులో 10.2 డిగ్రీలు కనిష్టంగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 29 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గిపోవడంతో చలి పులి వణికిస్తోంది. గాలిలో తేమ ఉదయం 70 నుంచి 88, మధ్యాహ్నం 20 నుంచి 32 శాతం మధ్య రికార్డైంది. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మండలాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే...
-------------------------------------------------------
మండలం ఉష్ణోగ్రతలు
డిగ్రీలలో..
------------------------------------------------------
అగళి 10.5
నల్లమాడ 11.3
రొద్దం 11.3
సోమందేపల్లి 11.5
మడకశిర 12
నంబులపూలకుంట 12.3
గుమ్మగట్ట 12.5
అమడగూరు 12.7
అమరాపురం 12.8
హిందూపురం 12.9
గాండ్లపెంట 12.9
చెన్నేకొత్తపల్లి 13
కుందుర్పి 13.1
కనగానపల్లి 13.1
శెట్టూరు 13.3
ఓబుళదేవరచెరువు 13.3
నల్లచెరువు 13.3
కొత్తచెరువు 13.4
తాడిమర్రి 13.5
పుట్లూరు 13.5
ఽతలుపుల 13.5
కళ్యాణదుర్గం 13.7
కూడేరు 13.7
గుడిబండ 13.7
కంబదూరు 13.9
---------------------------------------------------------------------------
మిగతా మండలాల్లో 14 నుంచి 17 డిగ్రీల వరకు కొనసాగాయి
--------------------------------------------------------------------------