జిల్లా అంతటా రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా అగళిలో మాత్రం గురువారం కూడా 12 డిగ్రీల కనిష్టం నమోదైంది.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా అగళిలో మాత్రం గురువారం కూడా 12 డిగ్రీల కనిష్టం నమోదైంది. తనకల్లు 13.2, మడకశిర, రొద్దం 13.3, సోమందేపల్లి 13.9 డిగ్రీలు నమోదు కాగా తక్కిన మండలాల్లో 14 నుంచి 20 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి.
గాలిలో తేమ శాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 25 నుంచి 35 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కొంత వరకు పెరిగినా చాలా మండలాల్లో చలితీవ్రత ఇంకా కొనసాగుతోంది.