జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఈ సీజన్‌లో మొదటిసారిగా రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపించింది.
– అగళిలో 11.9 డిగ్రీలు కనిష్టం,
-కనగానపల్లిలో 35.2 డిగ్రీలు గరిష్టం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఈ సీజన్‌లో మొదటిసారిగా రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపించింది. బుధవారం అగళి మండలంలో 11.9 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా కనగానపల్లి మండలంలో 35.2 గరిష్టం నమోదైంది. అగళి మినహా తక్కిన మండలాల్లో 14 నుంచి 21 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పగలు 30 నుంచి 35 డిగ్రీలు కొనసాగాయి. ఎండ తీవ్రత కాస్తంత పెరిగింది. చలితీవ్రత కొన్ని ప్రాంతాల్లో తగ్గుదల కనిపించింది. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 80, మధ్యాహ్నం 20 నుంచి 35 శాతం మధ్య ఉంది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.