తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి.
హైదరాబాద్: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. రంగారెడ్డి జిల్లా నవాబుపేట జడ్పీటీసీ ఉప ఉన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోలీస్ రాంరెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్లారెడ్డిపై 699 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శంషాబాద్ ఎంపీటీసీ-2 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రేష్మా సుల్తానా 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ దేవకొండమండలలోని గురకొండ ఎంపీటీసీక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మమ్మ విజయం సాధించారు.