స్పైస్‌జెట్‌ విమానానికి సాంకేతిక సమస్య | Technical problem SpiceJet flight | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌ విమానానికి సాంకేతిక సమస్య

Jul 27 2016 12:04 AM | Updated on Apr 8 2019 6:20 PM

విశాఖ విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది.

గోపాలపట్నం :విశాఖ విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానంలోకి ప్రయాణికులు ఎక్కాక సమస్య ఎదురవ్వడంతో అప్పటికపుడు ప్రయాణికులను దించడానికి వీల్లేక యుద్ధ ప్రాతిపదికపై సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిచేసి విమానాన్ని కదిలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి విశాఖకు సై ్పస్‌జెట్‌ విమానం సాయంత్రం 6.30కి చేరింది. ఇది ఏడు గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా, దాదాపు 170మంది ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు.


ఇంతలో విమానం  సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో పైలెట్‌ అప్రమత్తమయ్యారు. తలుపులు తెరవడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ప్రయాణికులను విమానంలోనే ఉంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. ప్రయాణికులకు నూడిల్సు తదితర ఆహారం సరఫరా చేసి సురక్షతంగా ఉంచారు. ఎట్టకేలకు రాత్రి 9.25కి సమస్య పరిష్కారమయి విమానం కదిలింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకుని క్షేమంగా వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement