కర్నూలు సబ్‌ రిజిస్రా​‍్టర్‌పై చర్యలు తీసుకోండి | take action on kurnool sub registrer | Sakshi
Sakshi News home page

కర్నూలు సబ్‌ రిజిస్రా​‍్టర్‌పై చర్యలు తీసుకోండి

Feb 10 2017 11:08 PM | Updated on Sep 5 2017 3:23 AM

ప్రభుత్వ భూమిగా గుర్తించి సెక‌్షన్‌ 22(ఎ)లో పెట్టి లావాదేవీని నిషేధించిన భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్‌ చేసిన కర్నూలు సబ్‌ రిజిష్ట్రార్‌ మహబూబ్‌బాషాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు తెలిసింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజీకి జేసీ రిపోర్టు
 
 కర్నూలు (అగ్రికల్చర్‌): ప్రభుత్వ భూమిగా గుర్తించి సెక‌్షన్‌ 22(ఎ)లో పెట్టి లావాదేవీని నిషేధించిన భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్‌ చేసిన కర్నూలు సబ్‌ రిజిష్ట్రార్‌ మహబూబ్‌బాషాపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు తెలిసింది. కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 234/1,2,3,4లోని ప్లాట్‌లను ప్రభుత్వ భూములుగా గుర్తించి క్రయ, విక్రయాలపై నిషేధం విధించింది. ప్రభుత్వ భూముల జాబితా అనెగ్జర్‌ –2లో పెట్టింది. అయితే కర్నూలు సబ్‌ రిజిస్ట్రార్‌ మహబూబ్‌ బాషా 21, 22 ప్లాట్‌లను 2015లో ఒకరి పేరుమీద, 2016లో మరొకరి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనిపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో కోనేరు రంగారావు కమిటీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సత్యనారాయణను విచారణ అధికారిగా నియమించారు. ఈయన విచారణ జరిపి అక్రమాన్ని నిర్ధారించినట్లు సమాచారం. ఈ మేరకు జేసీకి నివేదిక ఇచ్చారు. సబ్‌ రిజిస్ట్రార్‌ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజీకి రిపోర్టు రాసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement