బిల్లు కట్టమంటే.. చెవి కొరికేశాడు! | Supplier of hospitalizations | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టమంటే.. చెవి కొరికేశాడు!

May 18 2016 1:27 AM | Updated on Sep 4 2017 12:18 AM

బిల్లు కట్టమంటే.. చెవి కొరికేశాడు!

బిల్లు కట్టమంటే.. చెవి కొరికేశాడు!

తిన్న టిఫిన్‌కు బిల్లు చెల్లించమంటే ఏకంగా చెవి కొరికేశాడ్రా నాయనా..! అని లబోదిబోమంటూ ఓ సప్లయర్ ఆస్పత్రికి

మదనపల్లెలో దారుణం ఆస్పత్రి పాలైన సప్లయర్


మదనపల్లె క్రైం: తిన్న టిఫిన్‌కు బిల్లు చెల్లించమంటే ఏకంగా చెవి కొరికేశాడ్రా నాయనా..! అని లబోదిబోమంటూ ఓ సప్లయర్ ఆస్పత్రికి  పరుగులు తీశాడు. ఈ ఘటన మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చేనేత నగర్‌లో నివాసం ఉంటున్న అశోక్(22) స్థానిక మార్కెట్‌యార్డు వద్ద ఓ హోటల్‌లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. టిఫిన్ చేసేందుకు వచ్చిన అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు(40) కడుపునిం డా తిని బిల్లు కట్టకుండా వెళ్లిపోతుండగా గమనించి అడ్డుకున్నాడు.


దీంతో ఆ కస్టమర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా.. దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామానికి సప్లయర్ బిత్తరపోయాడు. అతడు తేరుకునేలోపే శ్రీనివాసులు అశోక్ చెవిని అమాంతం కొరికే శాడు. దీంతో బిల్లుకథ దేవుడెరుగు.. గగ్గోలు పెట్టడం అతడి వంతయ్యింది. సహచర సిబ్బంది అశోక్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. ఒకటవ పట్టణపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement