తల్లిపై అలిగి ఆత్మహత్యకు యత్నించాడు | suicide attempt of youngter | Sakshi
Sakshi News home page

తల్లిపై అలిగి ఆత్మహత్యకు యత్నించాడు

Aug 8 2016 12:35 AM | Updated on Sep 4 2017 8:17 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఆటో ఫైనాన్స్‌ వాయిదా చెల్లించడానికి డబ్బులు అడగ్గా తల్లి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : ఆటో ఫైనాన్స్‌ వాయిదా చెల్లించడానికి డబ్బులు అడగ్గా తల్లి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం అల్లంచర్ల కొత్తగూడెం గ్రామానికి చెందిన తవిటి శేషాద్రి ఫైనాన్స్‌పై ఆటో తీసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. శనివారం ఆటో ఫైనాన్స్‌కు వాయిదా చెల్లించాల్సి ఉండగా తన తల్లిని డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై రాత్రి గ్రామంలోని మిరపతోటలోకి వెళ్లి గుళికలు మింగాడు. విషయం తెలుసుకున్న శేషాద్రి బావ సూర్యనారాయణ కామవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏలూరు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శేషాద్రి చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement