విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి | Students develop a scientific attitude | Sakshi
Sakshi News home page

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

Aug 19 2016 10:53 PM | Updated on Sep 4 2017 9:58 AM

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

విద్యార్థులు చదువుతోపాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ పి.రాజీవ్‌ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (బాలికల)లో శుక్రవారం ‘సుస్థిర ఆహార భద్రతకు పప్పు ధాన్యాలు, అవకాశాలు–సవాళ్లు’ అంశంపై డివిజన్‌ స్థాయి సైన్స్‌ సెమినార్‌ నిర్వహించారు. ఈ సం ద ర్భంగా డీఈఓ సెమినార్‌ను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణిం చాలన్నారు.

  • జిల్లా విద్యాశాఖాధికారి రాజీవ్‌
  • మహబూబాబాద్‌ : విద్యార్థులు చదువుతోపాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ పి.రాజీవ్‌ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (బాలికల)లో శుక్రవారం ‘సుస్థిర ఆహార భద్రతకు పప్పు ధాన్యాలు, అవకాశాలు–సవాళ్లు’ అంశంపై డివిజన్‌ స్థాయి సైన్స్‌ సెమినార్‌ నిర్వహించారు. ఈ సం ద ర్భంగా డీఈఓ సెమినార్‌ను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణిం చాలన్నారు.
     
    విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. కాగా, డివిజన్‌స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు 5గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపికచేశారు. హన్మకొండ డైట్‌ కళాశాలలో ఈనెల 24న జిల్లాస్థాయి సైన్స్‌ సెమినార్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ పీజే.వివేకానంద, పాఠశాల హెచ్‌ఎం మరియం మాణిక్యమ్మ, జి.కృష్ణమూర్తి, ఎం.వెంకట్రాంనర్సయ్య, గురునాథరావు, బి.అప్పారావు, టి.శ్రీనాథ్, భార్గవి, జి.నారాయణ, జి.కమల్‌కుమార్‌ పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement