క్రమశిక్షణతో మెదిలితేనే ‘ముందడుగు’ | Student have must displane | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో మెదిలితేనే ‘ముందడుగు’

Sep 24 2016 10:10 PM | Updated on Sep 4 2017 2:48 PM

క్రమశిక్షణతో మెదిలితేనే ‘ముందడుగు’

క్రమశిక్షణతో మెదిలితేనే ‘ముందడుగు’

విద్యావంతులైన యువకులు, విద్యార్థులు సన్మార్గంలో పయనిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ జోయల్‌డేవిస్‌ అన్నారు. మండలంలోని బందంపల్లిలో శనివారం వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులతో సమావేశమై బంగారు భవిష్యత్తుకోసం అనుసరించాల్సిన మార్గాలను వివరించేందుకు ‘ముందడుగు’ పేరిట సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

  • యువత సన్మార్గంలో పయనిస్తే మంచి భవిష్యత్తు 
  • ఎస్పీ జోయల్‌ డేవిస్‌ 
  • పెద్దపల్లిరూరల్‌ : విద్యావంతులైన యువకులు, విద్యార్థులు సన్మార్గంలో పయనిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ జోయల్‌డేవిస్‌ అన్నారు. మండలంలోని బందంపల్లిలో శనివారం వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులతో సమావేశమై బంగారు భవిష్యత్తుకోసం అనుసరించాల్సిన మార్గాలను వివరించేందుకు ‘ముందడుగు’ పేరిట సమావేశాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. ఉన్నతవిద్యను చదివే సమయమే కీలకమైందన్నారు. ఆ సమయంలో యువత సక్రమమైన మార్గాలలో క్రమశిక్షణతో చదివితే భవిష్యత్‌ అంతా బంగారుమయమేనని పేర్కొన్నారు. వక్రమార్గంలో పయనించి జీవితాన్ని నాశనం చేసుకుని తల్లిదండ్రులకు శోకం మిగుల్చొద్దన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్‌ పేరిట తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకోసం శ్రమిస్తే సత్ఫలితాలే వస్తాయన్నారు. పోలీసులు ఇచ్చిన సందేశాత్మక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎస్పీ మల్లా రెడ్డి,  కళాశాలల కరస్పాండెంట్లు రేపాల రమేశ్, అల్లెంకి శ్రీనివాస్, తొడుపునూరి శ్రీనివాస్, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయేందర్‌ పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement