గుంతకల్లు : స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో గత రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఓపెన్ చెస్ చాంపియన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు.
ర్యాపిడ్ విభాగంలో విజయవాడకు చెందిన లక్ష్మణరావు, బ్లిట్జ్ విభాగంలో వెంకటకార్తీక్ (విజయవాడ) ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ నలుగురు క్రీడాకారులను అండమాన్ నికోబార్‌లో నవంబర్‌లో జరిగే జాతీయ స్థాయి చెస్ పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ మధ్య రైల్వే ఉమెన్స్ ఆర్గనైజేషన్ గుంతకల్లు డివిజన్ ఉపాధ్యక్షురాలు మాధవీలత, కార్యదర్శి రీటా, కోశాధికారి కేథరిన్‌లు హాజరై విజేతలకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఉమెన్స్ ఆర్గనైజేషన్ సభ్యులు అంజుమ్, మాధవి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షురాలు ఉమ, రైల్వే ఇన్‌స్టిట్యూట్ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.