ప్రత్యేకహోదా విషయంలో రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం కరపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి బహిరంగసభలో జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కళ్యాణ్ ఇచ్చిన సందేశాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు.
-
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య
కరప :
ప్రత్యేకహోదా విషయంలో రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం కరపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి బహిరంగసభలో జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కళ్యాణ్ ఇచ్చిన సందేశాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ప్రసంగం ఆసాంతం సినీఫక్కీలో నడిచిందన్నారు. దేశంలో జీడీపీ వృద్ధి 7.5 శాతం ఉంటే రాష్ట్రంలో 10.5 శాతం ఉందంటే ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు, ఇస్తున్న నిధులే కారణమన్నారు. కేంద్రప్రభుత్వ నిధులను రాష్ట్రప్రభుత్వం ఇస్టానుసారంగా వాడేసుకుంటూ అవినీతిమయంగా తయారైందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతుంటే నిఘా, ఇంటిలిజెన్స్ సంస్థలు ఏమి చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీని బలోపేతం చేసేందుకు మండల కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.