జర్నలిస్టుల ఉచిత విద్య అమలుకు ప్రత్యేక సెల్‌ | special cell to journalists free education impliment | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల ఉచిత విద్య అమలుకు ప్రత్యేక సెల్‌

Oct 15 2016 11:11 PM | Updated on Sep 4 2017 5:19 PM

జిల్లాలోని అక్రిడేటేషన్‌ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్‌ఐఓ చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం సూచించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని అక్రిడేటేషన్‌ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్‌ఐఓ చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం సూచించారు. ఈ  మేరకు డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ను శనివారం జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలులో ఎక్కడా సమస్యలు తలెత్తకూడదన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ఈ సెల్‌లో  ఫిర్యాదు చేయవచ్చని జర్నలిస్టులకు సూచించారు.

ఈ విషయంలో డీఈఓ, ఆర్‌ఐఓతో తరచూ పర్యవేక్షిస్తానన్నారు. ప్రత్యేక విభాగానికి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దష్టికి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ అంజయ్య, ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement