రాజన్న సేవలో స్పీకర్‌ | speaker visit RAJANNA | Sakshi
Sakshi News home page

రాజన్న సేవలో స్పీకర్‌

Sep 15 2016 12:05 AM | Updated on Sep 4 2017 1:29 PM

రాజన్న సేవలో స్పీకర్‌

రాజన్న సేవలో స్పీకర్‌

వేములవాడ : అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి బుధవారం ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.

వేములవాడ : అసెంబ్లీ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి బుధవారం ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. స్పీకర్‌ కుటుంబ సభ్యులు కోడెమెుక్కు చెల్లించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత యాభై ఏళ్లుగా తమ కుటుంబం ఎములాడ రాజన్నను దర్శించుకుంటున్నామని చెప్పారు. తమ తాత తండ్రుల కాలం నుంచి స్వామివారి సేవలో తరిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి అద్దాలమంటపంలో స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించి సత్కరించారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement