నల్లగొండ టూటౌన్ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరష్కరించాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.పాపిరెడ్డి, టి.పెంటయ్య డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలి
Aug 22 2016 12:46 AM | Updated on Sep 4 2017 10:16 AM
నల్లగొండ టూటౌన్ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరష్కరించాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.పాపిరెడ్డి, టి.పెంటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం టీపీయూఎస్ భవన్‌లో జరిగిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినందున ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. సమావేశంలో దామోదర్‌రెడ్డి, ఎన్.నర్సిరెడ్డి, శ్రీరాములు, నరేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, నర్సింహ, రామ్మోహన్, వీరేశం, అశోక్‌రెడ్డి, రవి, లింగయ్య, నాగయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement