సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం | software engineer commits suicide | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం

Aug 13 2015 8:11 AM | Updated on Nov 6 2018 7:56 PM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం - Sakshi

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం

గుండెనొప్పి తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్: గుండెనొప్పి తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ ఎస్‌ఐ రాజయ్య కథనం ప్రకారం...కేపీహెచ్‌బీకాలనీ ఫేజ్-3లో నివాసం ఉండే ఉమారాణి ఉస్మానియా ఆసుపత్రిలో ఉద్యోగి. ఈమె కూతురు సంధ్య (28) హైటెక్‌సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రోజూ మాదిరిగానే ఉమారాణి ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చే సరికి సంధ్య బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉంది.

 

ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. తాను కొంతకాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నానని, దీనికి తోడు తండ్రి చనిపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని మృతురాలు సంధ్య తన సూసైడ్ నోట్‌లో రాసిందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement