ఒకే కుటుంబంలో ముగ్గురి అదృశ్యం | Single-family In The disappearance of three members | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ముగ్గురి అదృశ్యం

Jun 26 2016 2:52 AM | Updated on Sep 4 2017 3:23 AM

ఒకే కుటుంబంలో ముగ్గురి అదృశ్యం

ఒకే కుటుంబంలో ముగ్గురి అదృశ్యం

యారాడకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని న్యూ పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వివరాల్లోకి వెలితే...

పెదగంట్యాడ : యారాడకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కనిపించడం లేదని న్యూ పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వివరాల్లోకి వెలితే... యారాడకు చెందిన  మరుపల్లి పైడిరాజు తన కొడుకు, కోడలు, మనవడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కొడుకు సత్యనారాయణ(35), కోడలు అనిత(30), మనవడు హరీష్(4) ఈ నెల 20న విజయనగరంలో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరారు.అయితే రాత్రయినా అక్కడకు చేరుకోలేదని, ఫోన్ చేసినా సమాధానం లేదని, మూడు రోజుల పాటు బంధువులు, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని  పైడిరాజు తెలిపారు. న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement