సింధును స్ఫూర్తిగా తీసుకోవాలి | sindhu is inspiration for women | Sakshi
Sakshi News home page

సింధును స్ఫూర్తిగా తీసుకోవాలి

Sep 18 2016 1:55 AM | Updated on Sep 4 2017 1:53 PM

సింధును స్ఫూర్తిగా తీసుకోవాలి

సింధును స్ఫూర్తిగా తీసుకోవాలి

ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని సాధించిపెట్టిన సింధూను మహిళా క్రీడాకారిణులు ఆదర్శంగా తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రెటరీ జి.పాణి అన్నారు. కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్‌ కళాశాలల ఉమెన్స్‌ క్రీడాపోటీలు శనివారం ముగిశాయి.

  • కేయూ స్పోర్ట్స్ సెక్రెటరీ జి.పాణి
  • ముగిసిన అంతర్‌ కళాశాలల క్రీడాపోటీలు
  • భీమారం : ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని సాధించిపెట్టిన సింధూను మహిళా క్రీడాకారిణులు ఆదర్శంగా తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రెటరీ జి.పాణి అన్నారు. కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్‌ కళాశాలల ఉమెన్స్‌ క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమన్నారు. అనంతరం కిట్స్‌ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ మాట్లాడుతూ  క్రీడలు మానసిక వికాసానిక దోహçదపడుతాయన్నారు. కేయూ పరిధిలోని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. వివిధ విభాగాల పోటీలలో  గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ రమేష్‌రెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ కళాశాలలకు చెందిన పీడీలు, తదితరులు పాల్గొన్నారు. 
     
    జిల్లా జట్ల జయకేతనం..
     
    బాస్కెట్‌బాల్‌లో వరంగల్‌ కిట్స్‌ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. క్రాస్‌ కంట్రీ పోటీల్లో హన్మకొండ కేజీసీ కాలేజీకి చెందిన ఎ.స్వప్న మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. చెస్‌లో వరంగల్‌ ఈస్ట్‌ పరిధిలోని టీఎస్‌డీఆర్‌సీ కాలేజీ, హ్యాండ్‌బాల్‌ విభాగంలో వరంగల్‌ కిట్స్ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. కబడ్డీ విభాగంలో కాకతీయ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌  ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ జట్టు, టేబుల్‌ టెన్నిస్‌లో వరంగల్‌ కిట్స్ జట్టు, వాలీబాల్‌లో హన్మకొండ ఎస్సార్‌ డిగ్రీ కళాశాల జట్టు​ రన్నరప్‌గా నిలిచాయి. 
     
     
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement