జిల్లాలో ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం జరగకుండా రైతులు పాస్‌పుస్తకాలు, పట్టాలో ఉన్న రైతుపేరు, కాస్తులో ఉన్న రైతుల పేరు, అసైన్డ్ భూములు, రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిదిద్దాలని ఆదేశించారు.
-
కలెక్టర్ వాకాటి కరుణ
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం జరగకుండా రైతులు పాస్‌పుస్తకాలు, పట్టాలో ఉన్న రైతుపేరు, కాస్తులో ఉన్న రైతుల పేరు, అసైన్డ్ భూములు, రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిదిద్దాలని ఆదేశించారు. జాప్యానికి కారణాలు గుర్తించి సత్వరం పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్బంగా రికార్డుల్లో తప్పులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్ బోర్డుపై రాస్తూ అధికారులకు వివరించారు. మొత్తంగా రెండు వారాల్లో భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమవేశంలో డిప్యూటీ కలెక్టర్లు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
హరితహారం మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం
జిల్లాలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. మంగళ వారం హైదరాబాద్ నుంచి అటవీ,పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌బీ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 4.37కోట్ల మొక్కల నాటినట్లు తెలిపారు. త్వరలో 4.50 కోట్ల లక్ష్యం చేరుకుంటామని ఆమె చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకుంటన్నామన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ 98 శాతం పూర్తయిందని, త్వరలో మిగతాపనులు పూర్తి చేస్తామని అన్నారు. జేసీ ప్రశాంత్ జీవ¯ŒSపాటిల్, డీఎఫ్‌వో శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.