'ఆ ఘనత కేసీఆర్దే' | Shabbir ali takes on kcr | Sakshi
Sakshi News home page

'ఆ ఘనత కేసీఆర్దే'

Jul 10 2015 2:09 PM | Updated on Aug 15 2018 9:27 PM

'ఆ ఘనత కేసీఆర్దే' - Sakshi

'ఆ ఘనత కేసీఆర్దే'

హైదరాబాద్ నగరాన్ని చెత్త సిటీగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని చెత్త సిటీగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ... పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.

సమ్మె దిగిన సదరు కార్మికుల డిమాండ్లు సమంజసమైనవే అని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. సమ్మెను పరిష్కరించకుంటే రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలే చెత్తను తొలగిస్తారన్నారు. హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తపై స్పందించాలని గవర్నర్ నరసింహన్కు షబ్బీర్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement