హత్య కేసులో ఏడుగురు అరెస్ట్‌ | Seven arrested in murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఏడుగురు అరెస్ట్‌

Oct 10 2016 10:31 PM | Updated on Sep 4 2017 4:54 PM

రామగిరి మండలం పేరూరుకు చెందిన బెస్త శ్రీనివాసులు (36)హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. చోరీల విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనే అతడిని మట్టుబెట్టినట్లు దొంగల ముఠా సభ్యులు ఒప్పుకున్నారు.

చెన్నేకొత్తపల్లి :

రామగిరి మండలం పేరూరుకు చెందిన బెస్త శ్రీనివాసులు (36)హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. చోరీల విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలోనే అతడిని మట్టుబెట్టినట్లు దొంగల ముఠా సభ్యులు ఒప్పుకున్నారు. ఆగస్టు ఆరో తేదీన జరిగిన ఈ హత్య  కేసులో నిందితులైన సిద్దన్న, రోగప్పగారి నాగరాజు, రాము, చెన్నప్పగారి కేశన్న, గడ్డం నాగరాజు, బొమ్మయ్య, మాదన్నలు వీఆర్వో రామ్మోహన్‌ ఎదుట లొంగిపోయారు.వీరిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చూపారు. ఇందుకు సంబంధించిన వివరాలను చెన్నేకొత్తపల్లిలోని సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌లో రామగిరి సీఐ యుగంధర్, ఎస్‌ఐ శేఖర్‌తో కలిసి డీఎస్పీ వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. నిందితులను ధర్మవరం కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement