‘సీమ’ అభివృద్ధే బీజేపీ సంకల్పం | ' seema' development BJP will | Sakshi
Sakshi News home page

‘సీమ’ అభివృద్ధే బీజేపీ సంకల్పం

Jul 27 2016 11:06 PM | Updated on Mar 29 2019 9:31 PM

‘సీమ’ అభివృద్ధే బీజేపీ సంకల్పం - Sakshi

‘సీమ’ అభివృద్ధే బీజేపీ సంకల్పం

కడప కేంద్రంగా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధే భారతీయ జనతా పార్టీ సంకల్పమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డిలు తెలిపారు.

కడప రూరల్‌ :
కడప కేంద్రంగా రాయలసీమ ప్రాంతాల అభివృద్ధే భారతీయ జనతా పార్టీ సంకల్పమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డిలు తెలిపారు. ఆ మేరకు ఆగస్టు చివరి వారంలో కడపలో జరిగే భారీ బహిరంగసభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొంటారని తెలిపారు. బుధవారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల కడప ఉక్కు పరిశ్రమపై పలు ఊహాగానాలు చెలరేగాయన్నారు. అయితే కేంద్రం తమకు స్పష్టమైన హామి ఇచ్చినట్లుగా చెప్పారు. అందులో భాగంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి త్వరలో ఒక బృందం కడపకు వస్తుందన్నారు.   అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడటం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇంతవరకు 1.50 లక్షల కోట్ల నిధులను కేటాయించిందని, ఇంకా మరిన్ని నిధులను కేటాయిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల శ్రీనాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లపురెడ్డి హరినాథరెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, చలమారెడ్డి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement