ముగిసిన స్కౌట్స్‌ శిక్షణ తరగతులు | scouts training classes closed | Sakshi
Sakshi News home page

ముగిసిన స్కౌట్స్‌ శిక్షణ తరగతులు

Sep 10 2016 9:55 PM | Updated on Sep 15 2018 8:00 PM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని స్కౌట్స్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్కౌట్స్, గైడ్స్‌ శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి.

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని స్కౌట్స్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్కౌట్స్, గైడ్స్‌ శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. ఈ నెల 6 నుంచి నిర్వహించిన శిబిరంలో పోల్కంపల్లి, పూడూర్, డోకూర్, అంకిళ్ల, పేరూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, షాద్‌నగర్‌ పట్టణంలోని ఠాగూర్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు శిక్షణ పొందినట్లు స్కౌట్స్, గైడ్స్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కమిషనర్‌ రాజగోపాల్‌ తెలిపారు. ఐదు రోజుల శిక్షణలో వీరికి ప్రథమచికిత్స, ముడులు, దిక్సూచి, పట నైపుణ్యం, హస్తకళలు, ఆరోగ్య, విద్య, సాహస క్రీడలు, ప్రకతి పర్యావరణ రక్షణ తదితర అంశాల్లో శిక్షణ  ఇచ్చినట్లు వెల్లడించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల వల్ల విద్యార్థుల్లో మానవీయత, భావవ్యక్తీకరణ, వ్యక్తిగత వికాసం, ఆత్మసై ్థర్యం, ఆధ్యాత్మిక చింతన, దేశభక్తి, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యం వంటి లక్షణాలు అలవడుతాయని అన్నారు. క్యాంప్‌ లీడర్‌గా రవీందర్, అసిస్టెంట్‌ ఆఫీసర్లుగా హన్మంతు, ఆనంద్‌ వ్యవహరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వసంధుర, శకుంతల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement